ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆత్మ గౌరవ దీక్ష చేపట్టనున్నట్లు టీజేఎస్ ప్రెసిడెంట్ కోదండరాం తెలిపారు. ఈ నెల 6న ఇందిరా పార్క్ వద్ద ఈ దీక్షను చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కారని, అయితే అధికారంలోకి వచ్చాక వాటి అమలును మరిచారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసగించారని ఆరోపించారు. ద్రోహులకు పెద్ద పీట వేసిన కేసీఆర్... ఉద్యమకారులను ఘోరంగా అవమానించారని ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. బంగారు తెలంగాణలో ఉద్యోగులకు కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితిలేదని ఎద్దేవా చేశారు. నిధుల కోసం మద్యం, కేంద్రంపైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోందని చెప్పారు. దీక్షను విజయవంతం చేసేందుకు ఉద్యమకారులు, విద్యావంతులు, మేధావులు, ఇతర నాయకులు కలిసిరావాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తల కోసం...

ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్ద పీట

ఆసియాలో అత్యంత ధనవంతుడిగా మళ్లీ అంబానీ