RRR బాధితులకు అండగా ఉంటా: కోదండరామ్

RRR బాధితులకు అండగా ఉంటానని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. RRR అలైన్ మెంట్ మార్చాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి కి ఆయన వినతి పత్రం అందజేశారు. RRR భూ నిర్వాసితులకు, రైతులకు తమ పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందన్నారు. భూమి లేని ఈ ప్రాంతంలో రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో అన్నదాతల నుంచి భూమిని బలవంతంగా లాక్కోవడం సరైంది కాదన్నారు. 

ప్రస్తుతం RRR అవసరం లేదని.. తక్షణమే ఈ రోడ్డు ను రద్దు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. రానున్న కాలంలో బాధితులతో కలిసి హైదరాబాద్ లో సదస్సు పెడతానని చెప్పారు.