కామారెడ్డి , వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా చేస్తోందని టీజేఎస్ ప్రెసిడెంట్ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో 'ప్రమాదంలో ప్రజాస్వామ్యం- ' బహిరంగ చర్చ ప్రొగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కాకతీయ యూనివర్సిటీలో కవులు, రచయితలపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. పెట్రోల్, డిజీల్ రేట్లు అధికంగా పెంచడంతో సామాన్యుల మీద భారం పడుతోందన్నారు.
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి , దేశానికి ప్రమాదమన్నారు. మతం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇలాంటి విధానాల్ని ఐక్యంగా ఉండి తిప్పి కొట్టాలన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరంకుశ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించినట్లే ఈ ఎంపీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలన్నారు. టీజేఎస్ స్టేట్జనరల్ సెక్రెటరీ నిజ్జన రమేశ్, జేఎసీ జిల్లా కన్వీనర్ జగన్నాథం, డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ఇలియాజ్అలీ, ప్రతినిధులు శ్రీహరిరావు, మోహన్‌రెడ్డి, చందు, వెంకటిగౌడ్, దశరథ్, మోతిరాం, జహీరాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి కూతురు గిరిజ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు.