తీన్మార్ మల్లన్నకు టీజేఎస్ మద్దతు

హైదరాబాద్, వెలుగు: నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతిస్తున్నట్టు టీజేఎస్ ప్రధాన కార్యదర్శి దర్మార్జున్ వెల్లడించారు. దీనిపై తమ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీఆర్ఎస్..తన ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటుపై  విషం కక్కుతూ.. ఏ ఒక్క విభజన హామీని నేరవేర్చని బీజేపీని ఓడించడానికే కాంగ్రెస్​కు మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. గ్రాడ్యుయేట్స్ అంతా తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని దర్మార్జున్ కోరారు.