పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ రాజ్యసభ సభ్యుడు ఎంసీ జవహర్ సిర్కార్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ మేరకు సెప్టెంబర్ 8న టీఎంసీ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి రాజీనామా లేఖ పంపారు. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటనపై ఆ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ సిర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతేకాదు ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా జవహర్ సిర్కార్ టీఎంసీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
కొంతమంది అవినీతిపరులకు తన సొంత పార్టీ మద్దతు పలుకుతున్నట్లు సిర్కార్ వివరించారు. ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో బాధితురాలికి న్యాయం కోసం నెల రోజులపాటు ఓపికగా ఉంటూ.. బాధపడ్డానని సిర్కార్ అన్నారు. ఈ కేసులో మమతా బెనర్జీ జూనియర్ డాక్టర్లతో ప్రత్యేక్షంగా మాట్లాడతారని ఆశించారట. కానీ.. అది జరగకపోవడంతో ఆయన ఆంధోళనకు గురైనట్లు తెలిపారు. ప్రభుత్వం ముందే ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకొని.. బాధ్యులను కఠినంగా శిక్షించి ఉంటే కోల్ కతాలోని ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉండేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు.