- పీఆర్సీ చైర్మన్‌కు టీఎన్‌జీవో విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం రూ.35 వేలు ఇవ్వాలని పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) చైర్మన్ ఎన్.శివశంకర్‌కు టీఎన్‌జీవో విజ్ఞప్తి చేసింది. 51 శాతం ఫిట్‌మెంట్, 33.87 శాతం కరువు భత్యం ఇవ్వాలని కోరింది. ఈ పెంపును గతేడాది జులై ఒకటి నుంచి అమలు చేయాలని కోరింది. ఈ మేరకు టీఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సోమవారం పీఆర్సీ చైర్మన్, సభ్యులను కలిసి వినతి పత్రం అందించింది.
కనీస వేతనం రూ.35 వేలు, గరిష్ట వేతనం 2 లక్షల 99 వేల ఒక వంద ఇవ్వాలని పేర్కొంది. సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని కోరింది. హెచ్‌ఆర్‌ఏను మండలాల్లో 14 శాతం, మున్సిపాలిటీలలో 19.5 శాతం, నగరాల్లో 27 శాతం ఇవ్వాలని కోరింది. కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.9,500 నుంచి రూ.17,500 కు పెంచాలంది. 15 ఏండ్ల సర్వీసు నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంది. ఇంటి లోన్ రూ.50 లక్షల వరకూ ఇవ్వాలంది.