కామారెడ్డి టౌన్, వెలుగు: వికారాబాద్కలెక్టర్, ఇతర ఆఫీసర్లపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని టీఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్నరాల వెంకటరెడ్డి, సెక్రటరీ సాయిలు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఎంప్లాయీస్జాయింట్యాక్షన్ కమిటీ తరపున అధికారుల మీద దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల న్నారు.
నవీపేట్, వెలుగు: ఉద్యోగులపై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట రెవెన్యూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వెంకట రమణ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.