హైదరాబాద్, వెలుగు: భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులకు సంబంధించిన గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ సమస్యను పరిష్కరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను టీఎన్జీవో నేతలు కోరారు. సోమవారం సెక్రటేరియెట్ లో టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, బీటీఎన్జీవో ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి, నరసింహరెడ్డిలు భట్టిని కలిసి సమస్యను వివరించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పట్టించుకోలేదని భట్టి దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై టీఎన్జీవో, బీటీఎన్జీవో నేతలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారని , ఈ సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని, వారంలోగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చినట్లు సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.