జీవో 261ను ప్రభుత్వం సవరించాలి : మారం జగదీశ్వర్​ 

జీవో 261ను ప్రభుత్వం సవరించాలి : మారం జగదీశ్వర్​ 
  • టీఎన్‌జీవో రాష్ట అధ్యక్షుడు  మారం జగదీశ్వర్​ 

వేములవాడ, వెలుగు :  రాష్ట్రంలో వేములవాడ, యాదాద్రి, భద్రాచలం ఆలయాల్లోని ఉద్యోగులకు కల్పిస్తున్న బెనిఫిట్స్‌ కొండగట్టు, బాసర, కొమురవెళ్లి ఆలయాల ఉద్యోగులకు కూడా ఇవ్వాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్​ కోరారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లావేములవాడ టౌన్ లోని ఓ హోటల్‌లో రాష్ట్రస్థాయి 6ఏ ఆలయ ఉద్యోగుల జేఏసీ మీటింగ్‌ జరిగింది.   రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 261 జీవోను సవరణ చేసి ఉద్యోగులందరికీ ఒకే న్యాయం చేయాలని పేర్కొన్నారు.

ఆలయాల్లో భక్తుల సంఖ్య రద్దీ పెరుగుతుందని,  కానీ సరిపడా సిబ్బంది లేకపోవడంతో సౌకర్యాలు, సేవల్లో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 10 ఏండ్లుగా పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ సిబ్బందిని రెగ్యులర్‌‌ చేయాలని కోరారు. ఈ సమావేశంలో  ఉద్యోగుల జేఏసీ చైర్మన్​గజవెల్లి రమేశ్‌బాబు, కో–  చైర్మన్  చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్,  జిల్లాల   టీఎన్జీవో అధ్యక్షుడు  ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు.