ఎలాంటి పత్రాలు, అనుమతులు లేకుండా నిర్మించిన కాంపౌండ్ వాల్‌ను టీఎన్జీవోస్ కాలనీ రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 156/1 ప్రభుత్వం స్థలం ఆక్రమించి ఇతరులకు విక్రయించారు. స్థలం కొన్నవారు కాంపౌండ్ వాల్ నిర్మించగా.. ఆ నిర్మాణాలను టీఎన్జీవోస్ కాలనీలో రెవెన్యూ అధికారుల బుధవారం కూల్చివేశారు.
ALSO READ | ఐదు అంతస్థుల బిల్డింగ్ కూల్చకుండా సీజ్ చేశారు.. ఎందుకంటే?
బాధితులు జేసీబీని అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపు చేశారు. లక్షల రూపాయలు పెట్టి స్థలాన్ని కొన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రెవెన్యూ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఓ వ్యక్తి జేసీబీ అద్దాలు పగలగొట్టడానికి ప్రయత్నించాడు. పోలీసులు కలుగజేసుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకి న్యాయం చేయాలని బాధిత కుటుంబం అధికారుల కాళ్లావేళ్లా పడింది.