మంచిర్యాల, వెలుగు : తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్(టీఎన్జీవో) యూనియన్ ఎన్నికలను ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి తెలిపారు. మంగళవారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, కన్నెపల్లి, మందమర్రి యూనిట్ల కార్యవర్గం గడువు నవంబర్‌తో ముగిసిందన్నారు.
కొత్త కార్యవర్గం ఎన్నిక కోసం ఎన్నికల అధికారులను నియమించినట్లు చెప్పారు. ఈ నెల 28న చెన్నూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, 29న మందమర్రి, కన్నెపల్లి, 30న మంచిర్యాల యూనిట్ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాథమిక సభ్యులు ఎలక్షన్ తేదీ ముందు రోజు వరకు సభ్యత్వం పొందాలని తెలిపారు.