
మెదక్ టౌన్, వెలుగు : మెదక్ జిల్లాకు బదిలీపై వచ్చిన కలెక్టర్ రాహుల్ రాజ్‌ను టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బుధవారం కలెక్టరేట్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉద్యోగులు ప్రజల వద్దకు తీసుకెళ్లాలన్నారు.
కలెక్టర్‌ను కలిసిన వారిలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి మినికి రాజ్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనురాధ, జిల్లా సహా అధ్యక్షుడు ఇక్బాల్ పాషా, కోశాధికారి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఫజలుద్దీన్, రఘునాథరావు, లీల, సంయుక్త కార్యదర్శి రాధ, ఆర్గనైజింగ్ కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మెదక్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు రామాగౌడ్, శ్రీకాంత్, వైద్య ఆరోగ్యశాఖ ఫోరం జిల్లా కార్యదర్శి మంజుల తదితరులు ఉన్నారు.