
హైదరాబాద్, వెలుగు: అనారోగ్యంతో టీఎన్జీవోస్ కేంద్ర సంఘం ట్రెజరర్, తెలంగాణ ఉద్యమ కారుడు రామినేని శ్రీనివాస్ రావు (60 ) కన్నుమూశారు. ఆయన ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్నారు. గత నెల 14న బ్రెయిన్ స్ట్రోక్ రాగా.. హైదరాబాద్మలక్ పేటలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.
శ్రీనివాసరావు గత 6 ఏండ్ల నుంచి కేంద్ర సంఘం ట్రెజరర్ గా పనిచేస్తున్నారు. సోమవారం నాదర్ గుల్లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, శ్రీనివాస్ రావు మృతికి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ముజీబ్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరి శ్రీనివాసరావు, సత్యనారాయణ సంతాపం తెలిపారు.