
ప్రస్తుత బిజీ లైఫ్ లో ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఆహారపు అలవాట్లు, సెల్ ఫోన్- సోషల్ మీడియా అడిక్షన్, నిద్రలేకపోవడం.. ఇలా చెప్పుకుంటూ పోతే టెక్నాలజీతో పాటు మారుతున్న లైఫ్ స్టైల్ లో సగటు మనిషి హెల్త్ కు ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలు ఈ రంగంలో బాగా ప్రమోషన్ చేస్తుండటంతో ఇన్సురెన్స్ తీసుకునే ట్రెండ్ ఏటేటా పెరుగుతోంది.
అయితే హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం వరకు ఓకే కానీ.. చాలా మందికి క్లెయిమ్ చేసుకోవడం తెలియదు. కొన్ని సార్లు క్లెయిమ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే రిజెక్ట్ అయ్యిందని ఏజెంట్లు చెప్పడం చూస్తుంటాం. ఇన్సురెన్స్ తీసుకునేటప్పుడు వెంటపడీ మరీ ఓపెన్ చేయించే ఏజెంట్లు.. సమస్య వచ్చినప్పుడు అంత తొందరగా స్పందించరనే అపవాదు ఉంది. అదే విధంగా కంపెనీలు కూడా ఏదో ఒక చిన్న కారణం చెప్పి రిజెక్ట్ చేయాలని చూస్తాయని ఎన్నో కంప్లయింట్లు ఉండనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. హెల్త్ ఇన్సురెన్స్ రిజెక్ట్ కాకూడదంటే ఏం చేయాలి.. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతాయి.. రిజెక్టు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓ సారి చూద్దాం.
1. ముందు నుంచి జబ్బులను చెప్పకపోవడం.. మెడికల్ హిస్టరీ ఇవ్వకపోవడం:
హెల్త పాలసీ కొన్నప్పుడు కచ్చితంగా ముందు నుంచి ఏమేం జబ్బులు ఉన్నాయో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డయాబెటిస్, హైపర్ టెన్షన్ మొదలైన కండిషన్స్ గురించి ముందుగానే చెప్పకుంటే కంపెనీలకు క్లెయిమ్ రిజెక్ట్ చేసే హక్కు ఉంటుందని ప్రముఖ ఇన్సురెన్స్ అడ్వైజర్ నిఖిల్ ఝా అంటున్నారు.
2. ముందే ఉన్న వ్యాధుల వెయిటింగ్ పీరియడ్:
చాలా కంపెనీలు ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజ్ ను పాలసీ తీసుకున్న వెంటనే ఇవ్వరు. కనీసం 3 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ కండిషన్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ పూర్తి కాకముందే క్లెయిమ్ చేసుకుంటే రిజెక్ట్ చేసే అవకాశం ఉటుంది. అదేవిధంగా మోకాలు ట్రీట్ మెంట్, కంటి ఆపరేషన్లు మొదలైన వాటికి 3 నుంచి 4 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంతకు ముందే అప్లై చేసుకుంటే రిజెక్ట్ అవుతుంది.
3. రూమ్ రెంట్ లిమిట్:
కొన్ని పాలసీలలో హాస్పిటల్ రూమ్ రెంట్ పై లిమిట్ ఉంటాయి. రూమ్ రెంట్ పాలసీ ఇచ్చే లిమిట్ ను దాటితే అది మనమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీలను ఎంచుకోవడం బెటర్. లేదంటే అలాంటి పాలసీలకు షిఫ్ట్ అవడం బెటర్ ఐడియా.
4. డాక్యుమెంటేషన్ కరెక్ట్ గా లేకపోవడం :
ఇన్వాయిస్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్ట్ మొదలైన డాక్యుమెంట్లలో తప్పులు ఉండటం, ఇందులో ఏదైనా డాక్యుమెంట్ సబ్మిట్ చేయకపోవడం కూడా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణం అవుతుంది.
5. డయాగ్నస్టిక్:
ఇన్సురెన్స్ పాలసీలు డయాగ్నస్టిక్స్, మానిటింగ్ కు సింగిల్ గా కవరేజ్ ఇవ్వవు. కేవలం అబ్జర్వేషన్ పర్పస్ లో జాయిన్ అయితే క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
పైన చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే హెల్త్ ఇన్సురెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ కాకుండా చూసుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే.. పాలస అప్లై చేసే ముందే అన్ని కండిషన్లు తప్పకుండా చదవడం బెటర్.
ALSO READ | Tasty Food: పూల్ మఖానా (తామరగింజల) రైతా.. ఒక్క సారి తింటే వదలరు..!