కాస్త శ్రద్ధ పెడితే ఘోరాలకు గురికాకుండా ఉంటాం

షేక్ పేట్ వద్ద పెట్రోల్ బంక్ కాలిపోవడం, ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ జంక్షన్ ఘోర ప్రమాదం… మన జీవితాలు ఎంత డేంజర్​ ఎడ్జ్​లో ఉన్నాయో అద్దం పడుతున్నాయి. ఆనందంగా గడపాల్సిన న్యూఇయర్​ రోజున చిన్నారి అవంత్ కుమార్ ఇంట్లో చీకట్లు కమ్ముకున్నాయి. అతని సహ విద్యార్థులు అదే ప్రమాదంలో గాయాల పాలైతే, వాళ్ల బంధువులు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ  రెండు ప్రమాదాలని డిజాస్టర్లుగానే గుర్తించాలి. డిజాస్టర్ అంటే ఎక్కువ మరణాలు, ఆస్తి నష్టం మాత్రమే కాదు. మనందరి క్షేమం–మన అందరి బాధ్యత అన్నది మరచిపోకూడదు.

రోడ్లపై నడిచేటప్పుడు…

  1.  రోడ్డు మీద నడిచేటఫ్ఫుడు మొబైలు వాడటం తగ్గించాలి.
  2.  రోడ్డు దాటేటప్పుడు గ్రీన్ సిగ్నల్ కోసం జీబ్రా క్రాసింగ్​ దగ్గర ఆగాలి.
  3.  ఓవర్ బ్రిడ్జ్ ఉన్నచోట్ల తప్పకుండా వాడుకోవాలి.
  4.  ముందుగా కుడి ఎడమలు చూసుకుంటూ సమయం కోసం వేచి ఉండాలి.
  5.  రోడ్డు పక్కన నడిచేటప్పుడు సాధ్యమైనంత పక్కగా, ఫుట్​పాత్​ ఉంటే దానిపైనే నడవాలి.

వెహికిల్ డ్రైవర్లు…

  1. హడావుడిగా బయలు దేరడంవల్ల డ్రైవింగ్​ దెబ్బతింటుంది.
  2.  లైట్ సిగ్నల్స్​ని నిర్లక్ష్యం చేయకూడదు. గ్రీన్ లైట్ రాక ముందే దాటే ప్రయత్నం చెయ్యవద్దు.
  3.  పార్కింగ్​ని రోడ్లపై అడ్డదిడ్డంగా చేయకూడదు.
  4.  మన వెహికల్​కి  పార్కింగ్ లైట్లు, సైడ్ ఇండికేటర్ లైట్లు పనిచేస్తున్నాయో లేదో చెక్​ చేసుకోవాలి.
  5.  లైట్ ఇండికేటర్స్ నిక్కచ్చిగా వేయాలి.
  6.  హెల్మెట్ పెట్టుకోవడం మరువరాదు.  వెహికిల్​ నడిపించేటప్పడు మన ధ్యాస పొలీసుల మీద కాకుండా డ్రైవింగ్ మీదనే ఉండాలి.
  7.  డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైలులో మాట్లాడటం తప్పు. అలాగే, చెవిలో మైక్రో ఫోన్లు పెట్టుకోవడం తగ్గించుకోవాలి.

ఇక, సంబంధిత ప్రభుత్వ డిపార్టుమెంట్లుకూడా కొన్ని బాధ్యతలు నిర్వహించాలి. జీబ్రా క్రాసింగ్​లు తప్పనిసరి చెయ్యటం,  రోడ్ల వైశాల్యాన్ని పూర్తి వినియోగంలోకి తేవడం, ఫుట్​పాత్​లు నడిచేవాళ్లకు అనువుగా మార్చడం,  పీక్ అవర్లో వెహికిల్స్​ ముందుకు సాగిపోయేలా చేయడం వంటివి చేపట్టాలి.

ఎం.కృష్ణమోహన్ , రిటైర్డ్ జీఎం, సింగరేణి కాలరీస్

To avoid road accidents we should follow the rules