దేశంలో ఎక్కువమంది వాడే మల్టీ మీడియా మెసేజింగ్ యాప్‘వాట్సాప్’. దీన్ని కొందరు లిమిటెడ్‌గా వాడితే, ఇంకొందరుచాలా ఎక్కువగా వాడుతుంటారు.తక్కువ వాడుతూ, ప్రైవసీ, సేఫ్టీ కోరుకునే వాళ్లకోసం వాట్సాప్‌లోఎన్నో సెక్యూరిటీ ఆప్షన్స్‌ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని,మీ అవసరానికి తగ్గట్లుగా సెట్టింగ్స్‌లో మార్చుకోండి.
- వాట్సాప్ వేరేవాళ్లు వాడకూడదనుకుంటే లేటెస్ట్‌గా వచ్చిన ఫింగర్‌ప్రింట్ ఎనేబుల్ ఆప్ష న్ యూజ్ చేసుకోవచ్చు. యాపిల్ ఫోన్స్ వాడేవాళ్తే ‘ఫేస్ లై ఐడీ/టచ్ ఐడీ’ కూడా వాడు కోవచ్చు. వాట్సాప్‌కు వీటిని సెట్ చేసుకుంటే, వేరేవాళ్లు వాట్సాప్ వాడలేరు.
- మొబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్‌ను వేరేవాళ్లు యూజ్ చేయకూడదనుకుంటే టు–స్టెప్ వెరిఫికేషన్ సెట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లోకి వెళ్, ‘సెలి క్యూరిటీ’లో దీన్ని సెట్ చేసుకోవాలి. దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ లాగిన్ అవ్వాలనుకుంటే రిజిస్ట్రే షన్ టైమ్‌లో సెట్ చేసుకున్న సిక్స్ డిజిట్స్ పిన్, ఓటీపీ అవసరం.
- అనవసర మెసేజ్‌లు పంపి ఇబ్బంది పెట్టే కాంటాక్స్ ట్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. లైవ్ లొకేషన్ కూడా ఎవరికీ తెలియకుండా సెట్ చేసుకుంటే, యూజర్స్ లొకేషన్ గురించిన సమాచారం వేరేవాళ్లకు తెలియదు.
- మీ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ ఎవరు చూడాలో, ఎవరు చూడకూడదో ఫిక్స్ చేసుకోవచ్చు. ప్రైవసీకి సంబంధించి ‘ఎవ్రీబడీ, మై కాంటాక్స్ ట్, నోబడీ’ అనే మూడు ఆప్ష న్స్‌లోంచి కావాల్సినదాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
- మీరు ఆన్‌లైన్‌లో ఉన్నా, మెసేజ్ ఎప్పుడు చూసినా ఎవరికీ కనిపించకూడదనుకుంటే ‘లాస్ట్ సీన్’ హైడ్ చేసుకోవచ్చు. ఏదైనా మెసేజ్ పొరపాటున ఎవరికైనా పంపితే, వెంటనే డిలీట్ చేసే ఆప్ష న్ కూడా ఉంది. మీ అనుమతి లేకుండా ఎవరూ గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఉండాలంటే సెట్టింగ్స్‌లో మార్చుకోవాలి.