గ్లకోమాకు బుల్లి ఐ స్టెంట్!

గ్లకోమాకు బుల్లి ఐ స్టెంట్!

గ్లకోమా.. ప్రపంచ వ్యాప్తంగా వ్యాధుల్లో రెండోస్థానం దీనిదే. అంత పెద్ద సమస్యను చిన్నపరికరంతో పరిష్కరించారు బ్రిటన్‌ సైంటిస్టులు. బియ్యపు గింజలో పదో వంతు పరిమాణంలో ఉండే‘ఐ స్టెంట్‌‌’ అనే ఓ చిన్న పరికరాన్ని తయారు చేశారు. పొడవు 0.4 మిల్లీమీటర్లు, వెడల్పు 0.3 మిల్లీమీటర్లు.సాధారణ కంటికి కనిపించదు. ధర రూ.81 వేలు.దానికి బ్రిటన్‌ లో ని నేషనల్‌‌ ఇన్‌ స్టి ట్యూట్‌‌ ఫర్‌‌ హెల్త్‌‌ అండ్‌‌ కేర్‌‌ ఎక్సలెన్స్‌‌ (ఎన్‌ ఐసీఈ) ఆమోదించడంతో వేలాది మంది పేషెంట్లు కొనేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా మంది పేషెంట్లకు అది సత్ఫలితాలనిచ్చింది. కాటరాక్ట్‌‌ సర్జరీ చేస్తున్నప్పుడే దీనినీ పెట్టొచ్చు. డాక్టర్లు మత్తుమందు ఇచ్చి ఓ చిన్న సూదిలాంటి పరికరంతో కంటి ముందు భాగంలో ఉండే ష్లెమ్‌ కెనాల్‌‌ భాగంలో ఈ స్టెంట్‌‌ను సెట్‌‌ చేస్తారు. ఇదే పరికరాన్నికంటి మరో భాగంలో బిగిస్తారు. హైపవర్డ్‌‌ మైక్రోస్కోప్‌ ద్వారా ఈ చికిత్స చేస్తారు. కేవలం అరగంటలోనే చికిత్స పూర్తవుతుంది. కనుగుడ్డులో పేరుకుపోయిన హానికర ద్రవాలను ఇది లాగేసుకుంటుం ది. శరీరం రక్షణ వ్యవస్థతో ఇబ్బం ది లేకుండా టైటానియమ్‌ తో ఈ పరికరాన్ని తయారు చేశారు. చిన్నగా ఉంటుంది కాబట్టి కంట్ లో ఉన్నట్ టు అనిపించదు. తొలిసారిగా ఓ రిటైర్డ్‌‌ ఇంజనీర్‌‌కు ఈ పరికరాన్ని అమర్చారు. గ్లకోమా చికిత్సలో ఈ విధానం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. కాగా, ఆరోగ్యవంతైన కంట్ లో ముఖ్యమైన విటమిన్లున్న ద్రవం కన్నంతా ప్రవహిస్తుంటుంది. కానీ గ్లకోమా వచ్చిన వారిలో ప్రవాహ నాళాలు పూడుకుపోతాయి. ద్రవంఎక్కడికక్కడ పేరుకుపోతుంది. దీంతో కంటి నరాలపై ఒత్తిడి పెరిగి క్రమంగా దృష్టి తగ్గిపోతుంది.