న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్ధతున్న ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) లో వచ్చే మూడు నెలల్లో లక్ష రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లను జాయిన్ చేసేందుకు రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని ఈ–కామర్స్ కంపెనీ మ్యాజిక్‌ఫిన్ ప్రకటించింది. జీరో కమీషన్, జీరో ఆన్‌బోర్డింగ్ ఫీజులు, ఫ్రీ హోమ్ డెలివరీ వంటి ప్రోత్సాహకాలను ఓఎన్‌డీసీలో జాయిన్ అయ్యే రెస్టారెంట్లకు మ్యాజిక్‌పిన్ ఆఫర్ చేయనుంది.
ఎక్కువ కమీషన్లు, ఆన్‌బోర్డింగ్ ఫీజులు వంటి అడ్డంకులు తొలగించి రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లు ఎటువంటి రిస్క్ లేకుండా ఓఎన్‌డీసీలో జాయిన్ అయ్యేలా చూస్తామని మ్యాజిక్‌పిన్ సీఎక్స్‌ఓ నమన్ మావాండియా అన్నారు. కాగా, ఓఎన్‌డీసీలో అతిపెద్ద సెల్లర్లలో మ్యాజిక్‌పిన్ ఒకటి. ఫుడ్ డెలివరీ సెగ్మెంట్‌లో స్విగ్గీ, జొమాటోతో ఈ సంస్థ పోటీ పడుతోంది.