లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!

  • ‘‘0’’ కలిపి డయల్ చేయడం తప్పనిసరి
  • నేటి నుంచే దేశవ్యాప్తంగా కొత్త మార్పు

న్యూఢిల్లీ: లాండ్​లైన్​ నుంచి మొబైల్​ నెంబర్​కు కాల్​ చేయాలంటే ముందు ‘0’ ని కలపడం ఇకమీదట తప్పనిసరి. శుక్రవారం నుంచే ఈ మార్పు అమలులోకి వచ్చింది. ఈ మార్పు వల్ల టెలికం కంపెనీలకు కొత్తగా 254.4 కోట్ల నెంబర్లను తెచ్చేందుకు వీలవుతుంది. కిందటేడాది నవంబర్​లోనే ట్రాయ్​ ఇందుకోసం సర్క్యులర్​ జారీ చేసింది. దేశంలో మొబైల్​ ఫోన్​ యూజర్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో మొబైల్​ ఆపరేటర్లకు వెసులుబాటు కల్పించేందుకే ట్రాయ్​ కొత్త మార్పును తెచ్చింది. 4జీ స్మార్ట్​ఫోన్స్​ చవకవుతున్న నేపథ్యంలో కొత్త యూజర్లు పెరుగుతారని అంచనా వేస్తున్నారు. ముందు ‘0’ చేర్చాలనే అంశాన్ని తమ లాండ్​లైన్​ కస్టమర్లందరికీ తెలియచేయాల్సిందిగా టెలికం ఆపరేటర్లను డాట్​ గత నవంబర్​లోనే ఆదేశించింది. యూజర్ల సంఖ్య భారీగా పెరిగితే, భవిష్యత్​లో 11 అంకెలతో మొబైల్​ నెంబర్లను జారీ చేసే సంకేతాలున్నాయి. మొబైల్​ నెంబర్లను ప్రస్తుతం 10 అంకెలతో జారీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా మార్పు కస్టమర్లందరికీ తెలిసేలా చొరవ తీసుకుంటున్నట్లు బీఎస్​ఎన్​ఎల్​ ఛైర్మన్​ పీ కే పుర్వార్​ చెప్పారు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!