చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి

చేతులు లావుగా ఉన్నాయా.. అయితే ఇలా చేయండి

కొంతమంది చాలా చలాకీగాఉంటారు. పంచ్​ లు వేస్తూ  హుషారుగా ఉంటారు.  బాడీ అంతా సన్నగా.. నాజుగ్గా ఉంటారు.  కాని చేతుల విషయంలో మాత్రం చాలాలావుగా ఉండి.. అటూ..ఇటూ కదపడానికి వారు పడే ఇబ్బంది అంతా కాదు.  స్పూన్​ తో ఆహారం తినాలన్నా ఆపసోపాలు పడతారు అలాంటి వారు కొన్ని వర్కౌట్స్ చేస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిని చేయడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి.

కొందరికీ బాడీ మొత్తం సన్నగా ఉన్నా చేతులు లావుగా ఉంటాయి. అలాంటివారు ఏ వర్కౌట్స్ చేస్తే చేతులు సన్నగా మారుతాయి.  కొన్ని బెల్లీ ఫ్యాట్‌ని తగ్గిస్తే, మరి కొన్ని ఫిట్‌నెస్, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా చేసేవి. కానీ, చేతులు లావుగా మారితే ఆ సమస్యని తగ్గించే వర్కౌట్స్ చాలా తక్కువ. వర్కౌట్ చేయడం వల్ల మన శరీరంలో ప్రతి భాగానికి లాభం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వర్కౌట్ చేస్తారు. చాలా వర్కౌట్స్ ఉన్నాయి. 

ఫార్వార్డ్ పంచ్ : ఇందుకోసం మీరు ఒక్కో చేతిని ముందుకు చాచి పంచ్ చేయాలి. పంచ్ బ్యాగ్‌‌పై పంచ్ చేస్తుండడం మంచిది. ముందుగా కుడి చేయిని తీసుకొచ్చి పంచ్ చేయాలి. తర్వాత ఎడమ చేతితో పంచ్ చేయండి. ఇలా నడుస్తున్నప్పుడు కూడా చేయొచ్చు.

చేతులు పైకి లేపడం.. ఈ ఎక్సైర్​సైజ్ వల్ల చేతులని నాజూగ్గా ఉంటాయి.  దీనిని కూడా నడుస్తూ చేయొచ్చు. నడిచేటప్పుడు మీ చేతులని నిటారుగా ఉంచండి. దీని తర్వాత ముందుకు కదులుతున్నప్పుడు కుడిచేతిని పైకి లేపండి. సమాంతరంగా ఉంచండి. తర్వాత ఎడమ చేతిని పైకి లేపి తలపైకి వెళ్ళనివ్వండి. రెండు చేతులని పైకి లేపి ఇలా చేయొచ్చు. మెల్లిమెల్లిగా స్పీడ్‌ని పెంచుకోవచ్చు.

నడిచేటప్పుడు : నడిచేటప్పుడు కూడా చేతులని అటూ ఇటూ కదల్చడం వల్ల ఆర్మ్ ఫ్యాట్ కరిగిపోతుంది. నడిచేటప్పుడు ఓ వైపు నుంచి చేతిని ముందుకు తెచ్చి వెనక్కి తీసుకోవాలి. మరో చేత్తో కూడా ఇలానే చేయాలి. దీంతో బరువు తగ్గుతారు. ఇది శరీర దిగువ భాగంలోని కండరాలను బలంగా చేస్తుంది.

కారణాలివే..నడిచేటప్పుడు బాడీలో స్ట్రెచింగ్ గుణాలు పెరుగుతాయి. తుంటి స్నాయువులపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది అథ్లెట్స్, సాధారణ వర్కౌట్, ఫిట్‌నెస్ బిగినర్స్ కోసం బ్యాలెన్స్‌ని అందిస్తుంది. తొడలు, తుంటి పిరుదుల్లోని కొవ్వుని కరిగిస్తుంది.