పొద్దున అలారం ఆపేసి ‘ఇంకాసేపు ప్లీజ్’ అని మంచం దిగని వాళ్లే ఎక్కువ. అలాంటి వాళ్ల కోసమే కొత్తగా లాంచ్ అయింది ‘ఛాలెంజెస్ అలారం క్లాక్– వేకప్ పజిల్స్’ అనే యాప్. మామూలు అలారం మల్లే టైం రిమైండ్ చేయదు ఈ యాప్. ఆఫ్ చేసి పడుకుందామన్నా ఊరుకోదు. ఒకసారి ఈ యాప్‌లో అలారం పెడితే ఆఫ్ చేయాలంటే ఓ పజిల్ సాల్వ్ చేయాలి. దాంతో ఆటోమేటిక్‌గా నిద్రమత్తు వదులుతుంది. అయితే ఈ యాప్‌లో అలారం సెట్ చేయడానికి ముందే ఛాలెంజెస్, గేమ్స్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ఈ పద్ధతి ఏదో బాగుంది కదా! లెట్స్ ట్రై ..ఈ యాప్‌ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Read more news
కళ్ల ముందే అద్భుతాలు.. త్వరలో అందుబాటులోకి ఏఆర్ టెక్నాలజీ