డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సీఎం కుర్చీలో కాలేజీ అమ్మాయి కూర్చుంది. ముఖ్యమంత్రిగా ఒక్కరోజు బాధ్యతలు నిర్వహిం చింది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా హరిద్వార్జిల్లాలోని దౌల్తాపూర్ గ్రామానికి చెందిన సృష్టి గోస్వామికి ఈ అవకాశం దక్కింది. రూర్కీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సృష్టి.. ఆదివారం సీఎం సీట్లో కూర్చుని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు పథకాలపై సమీక్ష జరిపారు. పలు అభివృద్ధి పథకాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నా రు. అగ్రికల్చర్ స్టూడెంట్ కావడంతో సంబంధిత అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. దీంతోపాటు రాష్ట్ర అసెంబ్లీలో మూడు గంటలపాటు మాక్ అసెంబ్లీ తరహాలో సెషన్ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా సృష్టి మాట్లాడుతూ.. ఒక్కరోజు సీఎంగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఉత్తరాఖండ్‌కు ఇప్పటి వరకు మహిళా సీఎం లేరు..దీంతో ఒక్కరోజే అయినప్పటికీ సీఎం కుర్చీలో కూర్చోవడం సంతోషంగా ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
తబలా కొట్టి..రికార్డు పట్టి..!