ప్రతి శుక్రవారం థియేటర్స్లో సినిమాలు జాతర ఉంటుంది. కానీ, ఈ శుక్రవారం (2025 జనవరి3) ఓటీటీ మోత మోగుతుంది. ఈ వారం మొత్తంలో ఓ 25కి పైగా సినిమాలు ఉన్నప్పటికీ.. కేవలం ఇవాళ ఒక్కరోజే (జనవరి 3న) 14 సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చాయి. మరి ఆ సినిమాలేంటీ? అందులో ఎన్ని స్పెషల్ కానున్నాయి? అవి ఎక్కడ స్ట్రీమింగ్కి కానున్నాయనే వివరాలు చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్:
సెల్లింగ్ ది సిటీ (ఇంగ్లీష్ రియాలిటీ వెబ్ సిరీస్)- జనవరి 3
వెన్ ది స్టార్స్ గాసిప్ (కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- జనవరి 4
ఆహా తెలుగు ఓటీటీ:
1.అన్ స్టాపబుల్ సీజన్ 4- (డాకు మహారాజ్' టీం)- జనవరి 3
2. లవ్ రెడ్డి (లవ్ యాక్షన్)- జనవరి 3న
అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ రెడ్డి’. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప కలిసి నిర్మించారు. 2024 అక్టోబర్ 18న థియేటర్స్లో రిలీజయింది. రాయలసీమ బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ మూవీ రూపొందిందింది.
ఆహా తమిళ్:
ఆరగన్ (తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- జనవరి 3
లయన్స్ గేట్ ప్లే ఓటీటీ:
డేంజరస్ వాటర్స్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 3
టైగర్స్ ట్రిగ్గర్ (చైనీస్ ఫ్యామిలీ యాక్షన్ మూవీ)- జనవరి 3
బిగ్ గేమ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ అడ్వెంచర్ మూవీ)- జనవరి 3
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ:
1.ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ (అవార్డ్ విన్నింగ్ మలయాళ డ్రామా మూవీ)- జనవరి 3
'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్..'(All We Imagine as Light) దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన తొలి ఫీచర్ ఫిల్మ్ ఇది. అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో అవార్డులతో పాటుగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రమిది.
కని కుశ్రుతి, దివ్య ప్రభ,ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ ఏడాది నవంబర్ 22న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణతో పాటు వసూళ్లు కూడా సొంతం చేసుకుంది.
కథేంటంటే:
ముంబైలో రోజువారీ జీవనం కోసం కష్టపడుతున్న ముగ్గురు మహిళల కథ. ముంబయి ఓ నర్సింగ్ హోంలో పనిచేసే కేరళకు చెందిన ఇద్దరు నర్సులు, మరియు పార్వతి అనే వంటమ్మాయి కథే ‘ఆల్ వీ ఇమేజిన్ యాజ్ లైట్’. అయితే ఆ నర్సులిద్దరు కలిసి ఓ బీచ్ టౌన్ కు రోడ్ ట్రిప్ వెళ్తారు. ఆ తర్వాత వారిద్దరి జీవితాలు ఎలా మారాయి.. ? అన్నదే ఈ సినిమా స్టోరీ. ఇకపోతే తెలుగులో ఈ మూవీని రానా రిలీజ్ చేశారు.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
1. గుణ సీజన్ 2 (హిందీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జనవరి 3
గునా S2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ సీనియర్ దర్శకత్వం వహించిన రెండవ సీజన్‌లో దర్శన్ పాండ్యా మరియు శశాంక్ కేత్కర్ కూడా ఉన్నారు. మరిన్ని ట్విస్టులతో, ఊహించని నాటకీయ క్షణాలతో ఉంటుందని మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఈ సిరీస్ ఇవాళ జనవరి 3న డిస్నీ+ హాట్‌స్టార్‌లోస్ట్రీమింగ్ కి వచ్చింది.
2. ఐ వాంట్ టు టాక్ (హిందీ సినిమా)- జనవరి 3
3. క్రిస్మస్ ఈవ్ ఇన్ మిల్లర్స్ పాయింట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా మూవీ)- జనవరి 3
4. విక్‌డ్ ఇంగ్లీష్ (మ్యూజికల్ ఫాంటసీ మూవీ)- జనవరి 3
సన్ నెక్స్ట్:
కడకన్ మూవీ- (మలయాళ యాక్షన్ థ్రిల్లర్)-జనవరి 3
సజిల్ మంపాడ్ దర్శకత్వం వహించిన మలయాళ యాక్షన్ చిత్రం కడకన్. ఈ చిత్రంలో హక్కిం షా ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ సన్‍నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఇవాళ (జనవరి 3) నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. గతేడాది 2024 మార్చిలో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజై ఆడియెన్స్‌తో పాటు క్రిటిక్స్‌ను మెప్పించింది. ఇసుక మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో వచ్చి ఆడియన్స్ కి మంచి థ్రిల్ ఇచ్చింది.
కథేంటంటే:
నీలంబూర్ ఏరియాలో ఇసుక మాఫియా ఘోరంగా జరుగుతోంది. అక్కడే ఉన్న గ్యాంగ్స్ లీడర్స్ మణి, సుల్ఫీ స్నేహం కాస్త శత్రుత్వంగా మారుతుంది. ఇసుక అక్రమ రవాణా కారణంగా ఏర్పడిన వీరి మధ్య పగ అది మరింత దూరం వెళుతోంది. ఇందులో సుల్ఫీ అనే వ్యక్తి లక్ష్మి అనే అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఆమె ప్రేమ కోసం మాఫియా బిజినెస్‌కు దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అనుకోకుండా సుల్ఫీ లోకల్ సీఐ రంజిత్‌తో గొడవపడతాడు.
మణితో చేతులు కలిపిన రంజిత్ సుల్ఫీని దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతాడు. సుల్ఫీని అరెస్ట్ చేయాలని అనుకుంటాడు. రంజిత్, మణి ప్లాన్స్‌ను సుల్ఫీ ఎలా ఎదుర్కొన్నాడు? ఇసుక మాఫియా అక్రమ దందాను వదిలిపెడతానని ప్రియురాలికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
vrott ఓటీటీ:
ది మ్యాన్ ఆన్ ది రోడ్ (తెలుగు డబ్బింగ్ ఇటాలియన్ థ్రిల్లర్ మూవీ)- జనవరి 3
ఈ మొత్తం లిస్టులో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు నామినేట్ అయిన మలయాళ డ్రామా మూవీ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ స్పెషల్‌గా ఉంది. దీంతో పాటు లవ్ రెడ్డి ఆకట్టుకోనుంది. తెలుగు డబ్బింగ్ సినిమాలు బిగ్ గేమ్ (అడ్వెంచర్ థ్రిల్లర్), ది మ్యాన్ ఆన్ ది రోడ్ (థ్రిల్లర్) కూడా.
అంతేకాకుండా ఐ వాంట్ టు టాక్ కూడా స్పెషల్ కానుంది. ఇది తండ్రీకూతుళ్ల బంధానికి అద్దం పట్టే ఎమోషనల్ మూవీ. ఇందులో అభిషేక్ బచ్చన్ నటించాడు. అలాగే గుణ 2 వెబ్ సిరీస్, కడకన్, అన్ స్టాపబుల్ సీజన్ 4 ఎపిసోడ్ థ్రిల్ ఇవ్వనున్నాయి.