Today OTT Movies: నేడు (మార్చి 28న) ఓటీటీలో 12కి పైగా సినిమాలు.. థియేటర్ మూవీస్కి ఏ మాత్రం తగ్గేదేలే

Today OTT Movies: నేడు (మార్చి 28న) ఓటీటీలో 12కి పైగా సినిమాలు.. థియేటర్ మూవీస్కి ఏ మాత్రం తగ్గేదేలే

ఈ వారం ఉగాది స్పెషల్గా కొత్త సినిమాలు థియేటర్స్/ ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే, థియేటర్స్కి తెలుగు నుంచి రెండు కొత్త సినిమాలు ప్రేక్షకులు ముందుకొచ్చాయి. తమిళ, మలయాళ భాషల్లో నుంచి నిన్న (మార్చి 27న) రెండు సినిమాలొచ్చాయి.

ఇందులో వేటికవే విభిన్నమైన కథాంశాలతో వెండితెరపై అలరిస్తున్నాయి. ఇక ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా డిజిటల్ ప్లాట్ఫామ్లో సైతం (మార్చి 28న)  సినిమాలు, సిరీస్లు సందడి చేయడానికి వచ్చాయి. అందులో క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్, హిస్టారికల్ మూవీస్ ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటీ? అవెక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వివరాలు చూసేద్దాం.  

Also Read : మోహన్ లాల్ ఎంపురన్ ఫస్ట్ డే బాక్సాఫీస్

అమెజాన్ ప్రైమ్:

శబ్దం (తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28

అగత్యా (తమిళ, తెలుగు హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్)- మార్చి 28

ఛూ మంతర్ (కన్నడ హారర్ థ్రిల్లర్)- మార్చి 28

మలేనా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ ఎరోటిక్ రొమాంటిక్ థ్రిల్లర్)- మార్చి 29 (ఫ్రీ స్ట్రీమింగ్)

నెట్‌ఫ్లిక్స్:

ది లేడీస్ కంపానియన్ (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- మార్చి 28

దేవా (పూజా హెగ్డే హిందీ యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 28

ది లైఫ్ లిస్ట్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ)- మార్చి 28

జీ5:

మజాకా (తెలుగు రొమాంటిక్ కామెడీ)- మార్చి 28

ఫైర్ (తమిళ బోల్డ్ అండ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28

విడుదల పార్ట్ 2 (హిందీ వెర్షన్ ఆఫ్ తమిళ యాక్షన్ డ్రామా)- మార్చి 28

సెరుప్పుగల్ జాకిరతై (తమిళ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 28

సన్ ఎన్ఎక్స్‌టీ:

అగత్యా (తెలుగు, తమిళ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ)- మార్చి 28

సోనీ లివ్:

విజయ్ ఎల్ఎల్‌బీ ది అడ్వోకేట్ (తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ కోర్ట్ డ్రామా)- మార్చి 28

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

ఓం కాళీ జై కాళీ (తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ రివేంజ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 28

పాల్ అమెరికన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మార్చి 28

లయన్స్ గేట్ ప్లే:

డెన్ ఆఫ్ థీవ్స్ 2: పంటేరా (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్)- మార్చి 28

వీటిలో ఓ 5 నుంచి 6 తెలుగు సినిమాలు స్పెషల్ గా ఉన్నాయి. సందీప్ కిషన్ మజాకా, హారర్ మూవీ శబ్దం, తెలుగు, తమిళ వెర్షన్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ అగత్యా, తెలుగు డబ్బింగ్ క్రైమ్ యాక్షన్ సినిమా డెన్ ఆఫ్ థీవ్స్ 2, వెబ్ సిరీస్ ఓం కాళీ జై కాళీ ఆసక్తికరంగా ఉండనున్నాయి.

  • Beta
Beta feature