ఉమ్మడి వరంగల్ జిల్లాలో సోమవారం ఒక్కరోజే 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మంగళవారం జిల్లాలో పర్యటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. 15 కాలనీల్లో నో మూమెంట్ జోన్స్ గా ప్రకటించామని.. డిల్లీకి ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లకే పాజిటీవ్ వచ్చిందన్నారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ల నమూనాలు పరీక్షలకు పంపించామని.. 35 మందికి నెగిటీవ్ వచ్చిందన్నారు. మిగతా వారికి రిపోర్ట్స్ రావాల్సి ఉందని కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రజలు మరింత పకడ్బందీగా లాక్ డౌన్ పాటించాలన్నారు. ఎవ్వరికీ సడలింపులు, మినహాయింపులు ఉండవన్న మంత్రి.. నిబంధనలు అతిక్రమించే వాళ్ళపై కేసులు ఉంటాయని ముందస్తుగా హెచ్చరికలు చేస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడొద్దనే చర్యలు తీసుకుంటామని.. జనం క్షేమం కోసమే కఠిన నిర్ణయాలన్నారు.
ఇందుకు ప్రజలు సహకరించాలని..ప్రజలకు అందుబాటులోకి నిత్యావసర సరుకులు, కూరగాయలు ధరలు నియంత్రణలోనే ఉన్నాయన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 835 దాన్యం, 265 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 6 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు, 10 లక్షల 67వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుగా అంచనా ఉందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళనకు గురికావద్దని తెలిపారు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.