తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1920కి చేరింది. తెలంగాణలో కరోనా పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య శాఖ సోమవారం రాత్రి బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదు కాగా.. అందులో 31 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారేనని తెలిపింది. రంగారెడ్డి జిల్లాలో ఇవాళ ఒక కరోనా కేసు నమోదైందని తెలిపింది. మిగిలిన 34 కేసుల్లో వందే భారత్ మిషన్ లో భాగంగా విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు 18 మంది, వలస కూలీలు 15 మంది, మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి ఉన్నారని చెప్పింది.
56కు చేరిన మరణాలు
గడిచిన 24 గంటల్లో 72 మంది పూర్తిగా కోలుకున్నారని, దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1164కి చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే కొత్తగా ముగ్గురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 56కి చేరినట్లు తెలిపింది. ప్రస్తుతం మొత్తంగా 700 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.
Media bulletin
Date: May 25, 2020Status of positive cases of #COVID19 in Telangana. pic.twitter.com/GsK9vSGhLf
— Minister for Health Telangana State (@TelanganaHealth) May 25, 2020