రోజురోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అయితే ప్రతిరోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ వ్యాప్తంగా 730 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,802కు చేరింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,297 పరీక్షలు చేయగా.. అందులో 730 పాజిటివ్ గా తేలాయి. మిగతా 2,567 నెగిటివ్ గా తేలాయి. కరోనా బారినపడి ఈ రోజు 7 మరణించారు. కాగా.. కరోనా నుంచి కోలుకొని ఈ రోజు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 225గా ఉంది.
జీహెచ్ఎంసీలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం జీహెచ్ఎంసీ పరిధిలో 659 కేసులు నమోదయ్యాయి. జనగాం జిల్లాలో 34, రంగారెడ్డిలో 10, మేడ్చల్ 9, వరంగల్ 6, ఆసిఫాబాద్ 3, వికారాబాద్ 2, కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట్, మెదక్, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి.
ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 57,054 కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం 3861 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బారినపడి నేటివరకు 210 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
For More News..