గ్రేట‌ర్ ప‌రిధిలో ఒక్క‌రోజే 8 కేసులు

గ్రేట‌ర్ ప‌రిధిలో ఒక్క‌రోజే 8 కేసులు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో శ‌నివారం ఒక్క‌రోజే కొత్త‌గా 8 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ విష‌యాన్ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ తెలిపారు. గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న వ‌ల‌స కార్మికుల‌కు ప్రాధ‌మిక వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. క‌రోనా ఉన్న‌ట్లు అనుమానం క‌లిగితే క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. అలాగే వ‌ల‌స కార్మికుల‌కు ఆహారంతో పాటు సబ్బులు, శానిటైజ‌ర్లు, మాస్కులు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు.