ఏపీలో కొత్త‌గా 80 కేసులు: ముగ్గురు మృతి

ఏపీలో కొత్త‌గా 80 కేసులు: ముగ్గురు మృతి

ఏపీలో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులు..గురువారం కూడా భారీగా పెరిగాయి. 24 గంట‌ల్లో కొత్త‌గా 80 కరోనా కేసులు నమోదవగా, ముగ్గురు మరణించారు.ఈ విష‌యాన్ని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉద‌యం 10 గంట‌ల‌కు బులిటెన్ ద్వారా విడుద‌ల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరగా.. 725 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌ని తెలిపింది.

141 మంది డిశ్చార్జి అయ్యార‌ని.. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. మొత్తంగా ఈ రెండు జిల్లాల్లో 48.7 శాతం కేసులు నమోదయ్యాయని.. ఇప్పటివరకు కర్నూలులో 234 మంది, గుంటూరులో 195 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారని చెప్పింది. రాష్ట్రంలో ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల 27 మంది చనిపోగా, ఇందులో గుంటూరు జిల్లాకు చెందినవారు ఎనిమిది మంది ఉన్నారని వివ‌రించింది.

ఇవాళ్టి పాజిటివ్ కేసులు జిల్లాల వారిగా
క‌ర్నూల్ – 31
అనంత‌పూర్- 06
చిత్తూరు- 14
ఈస్ట్ గోదావ‌రి- 06
గుంటూరు 18
కృష్ణ -02
ప్ర‌కాశం-02
వైజాగ్ -01