ఇవాళ (ఏప్రిల్ 27) BRS రజతోత్సవ సభ.. హనుమకొండలోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు

ఇవాళ (ఏప్రిల్ 27) BRS రజతోత్సవ సభ.. హనుమకొండలోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు
  • హనుమకొండలోని ఎల్కతుర్తిలో భారీ ఏర్పాట్లు
  • 159 ఎకరాల్లో సభా ప్రాంగణం.. వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ 
  • 1,100 మంది పోలీసులతో బందోబస్తు 
  • సాయంత్రం 4:30 గంటలకు ఎల్కతుర్తికి కేసీఆర్

హనుమకొండ / వరంగల్‍, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి శివారులో దాదాపు 1,250 ఎకరాల్లో సభ నిర్వహణ కోసం స్థలాన్ని చదును చేశారు. సుమారు 159 ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు.

దాదాపు 500 మంది కూర్చునేలా వేదిక సిద్ధం చేశారు. వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. సభకు 20 వేలకు పైగా వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 లక్షల మందికి పైగా వస్తారని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ప్రభబండ్లతో ఆ పార్టీ కార్యకర్తలు సభా ప్రాంగణానికి బయలుదేరారు. కాగా, బీఆర్ఎస్ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసీఆర్ ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్యలో హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎల్కతుర్తికి చేరుకోనున్నారు. సభా స్థలానికి సమీపంలోనే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. 

ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ ఇదే.. 

2023 డిసెంబర్‍లో కాంగ్రెస్‍ అధికారంలోకి వచ్చాక బీఆర్‍ఎస్‍ చీఫ్ కేసీఆర్ బయటకు రావడానికి అంతగా ఇష్టపడలేదు. పార్టీ మీటింగ్స్ మొదలు అసెంబ్లీ సమావేశాల వరకు హాజరు కాలేదు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాగా, బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీ నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభ ఇదే. ఈ సభతో మళ్లీ జనాల్లోకి రావాలని భావిస్తున్న బీఆర్‍ఎస్‍.. మొదటి నుంచి దీన్ని హైలైట్‍ చేస్తున్నది. ఇందులో భాగంగానే స్థల సేకరణ మొదలైనప్పటి నుంచే కేటీఆర్‍, హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, కవితతో పాటు శ్రీనివాస్‍గౌడ్‍, జగదీశ్‍రెడ్డి వంటి నేతలు జిల్లాకు వచ్చి పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నట్టు చెప్పుకొచ్చారు. 

1,100 మందితో బందోబస్తు.. 

రజతోత్సవ సభకు 10 లక్షల మందికి పైగా వస్తారని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి 3 వేల బస్సులు, కార్లు, టాటా ఏస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ట్రాక్టర్లు, డీసీఎంలు, లారీలు కలిపి 20 వేలకు పైగా వెహికల్స్ తరలివస్తాయని భావిస్తున్నారు. ఎండల నేపథ్యంలో వారి కోసం దాదాపు 10 లక్షల వాటర్ బాటిల్స్, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో పెడుతున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సభా ప్రాంగణంలో 12 వైద్య శిబిరాలు, 10 వరకు అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మహిళల కోసం టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

 విద్యుత్​సరఫరాకు అంతరాయం లేకుండా సుమారు 200 జనరేటర్లు, సభతో పాటు పార్కింగ్ స్థలాలను కవర్ చేసేలా 300 వరకు ఎల్ఈడీ లైటింగ్ స్టాండ్స్, వేదికపై ఉన్న నేతలు కనిపించేలా ఎక్కడికక్కడ భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కాగా, సభకు 10 లక్షల మంది వస్తారని బీఆర్‍ఎస్‍ నేతలు చెప్పడంతో పోలీస్‍ శాఖ 1,100 మందికి పైగా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేసింది.