
ప్రతివారం ఓటీటీ(OTT)లో సినిమాలు, సిరీస్లు సందడి చేస్తున్నాయి. అందులో వేటికవే భిన్నమైన కాన్సెప్ట్స్తో వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కడ బోర్ కొట్టని క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా వంటి సిరీస్లు ఆకట్టుకుంటున్నాయి.
ఈ క్రమంలో ఇవాళ (2025 ఏప్రిల్ 4న) ఒక్కరోజే 4 సినిమాలు స్ట్రీమింగ్కి సిద్ధమయ్యాయి. అవి ఆహా, ఈటీవీ విన్, నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి వచ్చాయి. మరి ఆ సినిమాలేంటీ? వాటి జోనర్ ఏంటనేది ఓ లుక్కేద్దాం.
1. 'టచ్ మీ నాట్' (Touch Me Not):
హీరో నవదీప్, దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సిరీస్ 'టచ్ మీ నాట్' (Touch Me Not). కొరియన్ సిరీస్ హి ఈజ్ సైకోమెట్రిక్ రీమేక్గా తెరకెక్కిన టచ్ మీ నాట్ సిరీస్ ట్రైలర్ తోనే అంచనాలు పెంచేసింది.
ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నేడు ఏప్రిల్ 4న జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. హీరో నాగ శౌర్యతో అశ్వథ్థామ మూవీ తీసిన డైరెక్టర్ రమణ తేజ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. శవాలను ముట్టుకోని క్రైమ్ ఎలా జరిగిందో చెప్పే, ఓ యువకుడి చుట్టూ తిరిగే సైకలాజికల్ థ్రిల్లర్ ఇది.
2. 'హోమ్ టౌన్' వెబ్ సిరీస్(Home Town):
రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద, సైదమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'హోమ్ టౌన్', ఆహా ఓటీటీ వేదికగా నేడు ఏప్రిల్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇంటి చుట్టు అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించాడు దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి పల్లే. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఈ సిరీస్‌కు సినిమాటోగ్రాఫర్‌గా దేవ్ దీప్ గాంధీ కుండు పనిచేయగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించాడు.
3.‘టెస్ట్’(TEST):
నయనతార, మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన చిత్రం ‘టెస్ట్’. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో నేడు ఏప్రిల్ 4న స్ట్రీమింగ్‌కు రానుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్.శశికాంత్ దర్శకుడు. ఈ మూవీని వైనాట్ స్టూడియోస్ నిర్మించింది. చెన్నైలో జరిగిన టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయనేది ప్రధాన కథాంశం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది. అయితే, టెస్ట్ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీకి ఎంట్రీ ఇవ్వడం విశేషం.
4."ఒరు జాతి జాతకం" (Oru Jaathi Jathakam):
"ఒరు జాతి జాతకం" అనే ఈ మూవీ 2025లో విడుదలైన మలయాళీ సినిమా. దీనిని ఎం. మోహనన్ తెరకెక్కించగా.. రాకేష్ మంతొడి రచించారు. ఇది ఒక రొమాంటిక్ కామెడీ సినిమా. ఇందులో వినీత్ శ్రీనివాసన్, నిఖిలా విమల్ మరియు పూజ మోహన్ రాజ్ నటించారు. ఈ మూవీ నేడు శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి మనోరమ MAX లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే.. ఒక 38 ఏళ్ల బ్రహ్మచారి, తన జాతకం ప్రకారం.. తన కలల అమ్మాయిని కనుగొనడానికి వెళ్తాడు. కానీ, అతని ప్రేమలో ఎదురయ్యే సవాళ్లు, తనని విమర్శించే నోళ్లు, ఈ మధ్యన వచ్చే కుటుంబ సమస్యలు. వీటన్నిటి మధ్య తాను ఎలాంటి ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకున్నాడనేది మిగతా కథ.
5.‘ఉద్వేగం’(Udvegam):
త్రిగుణ్ హీరోగా మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో గతేడాది వచ్చిన మూవీ ‘ఉద్వేగం’.ఈ మూవీ 2024 నవంబర్ 29న థియేటర్లలో రిలీజైంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. గురువారం (ఏప్రిల్ 3) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
“ఒక్క కేసు.. ఎన్నో ట్విస్టులు. చివరికి సత్యం జయిస్తుందా? ఈ గ్రిప్పింగ్ కోర్టు రూమ్ డ్రామాను చూడండి కేవలం ఈటీవీ విన్ ఓటీటీలో చూడండి”అనే క్యాప్షన్తో సదరు ఓటీటీ సంస్థ వెల్లడించింది. ఈ మూవీ IMDB 8.3 రేటింగ్ సొంతం చేసుకుంది.
ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడైన ఓ వ్యక్తి గురించి.. ఎలాంటి క్రిమినల్ కేసులనైనా తన చాకచక్యంతో వాదించే న్యాయవాది చుట్టూ తిరిగే కథ ఇది. ఆ తర్వాత అతను వాదించే కేసులో లొసుగులు గుర్తించాకా.. తన లైఫ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఆసక్తికరం.