
కంచు మోగినట్లు కనకం మోగునా అనే సామెతను మార్చేసింది బంగారం.. ఇప్పుడు కనకం ధర కంచు మోగినట్లు మోగుతోంది. రికార్డు బద్దలు కొడుతూ పరుగులు పెడుతోంది బంగారం ధర.. 2025, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 11 గంటల సమయానికి.. ఇండియాలో బంగారం ధరలు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాయి.
>>> 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 98 వేల 350 రూపాయలకు చేరుకుంది. అంటే లక్ష రూపాయలకు 16 వందల 50 రూపాయలు మాత్రమే తక్కువ. ఏప్రిల్ 21వ తేదీ ఒక్క రోజే 10 గ్రాముల బంగారం ధర 770 రూపాయలు పెరిగింది.
>>> ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరిగింది. 10 గ్రాములపై 700 రూపాయలు పెరిగి.. 90 వేల 150 రూపాయలకు చేరుకున్నది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90 వేల రూపాయలు దాటటం ఇదే ఫస్ట్ టైం.
>>> ఇక 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 570 రూపాయలు పెరిగి.. 73 వేల 760 రూపాయలకు చేరుకున్నది.
వెండి ధరలు కూడా పరుగులు పెడుతోంది. కిలో వెండి లక్షా ఒక్క వెయ్యి రూపాయలుగా ఉంది. 2025, ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 11 గంటల సమయానికి కిలో వెండి ధర.. గతంతో పోల్చితే వెయ్యి రూపాయలు పెరిగింది.
►ALSO READ | 2025లో కొత్తగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు .. ఏడాది లెక్కన 20 శాతం పెరుగుదల
బంగారం, వెండి ధరలు భారీగా పెరగటం వెనక కారణాలు లేకపోలేదు. డాలర్ తో రూపాయి విలువ తగ్గటం, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు ఆశాజనకంగా లేకపోవటంతో.. బంగారం ధరకు రెక్కలు వస్తున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోవటానికి ఎంతో సమయం లేదని.. ఇప్పుడు ఉన్న ధరలు స్పష్టం చేస్తున్నాయి.