మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. తులం లక్షకు పోయేదాకా తగ్గేదేలే..!

మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. తులం లక్షకు పోయేదాకా తగ్గేదేలే..!

బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయ్. తులం లక్షకు పోయేదాకా అస్సలు తగ్గేదేలే అనే తరహాలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీంతో.. శుభకార్యాలకు ప్లాన్ చేసుకున్న మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇవాళ(ఫిబ్రవరి 19, 2025) కూడా బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 700 రూపాయలు పెరగడం గమనార్హం. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 650 రూపాయలు పెరిగింది.

10 గ్రాములపై 700 రూపాయలు పెరగడంతో 24 క్యారెట్ల బంగారం ధర 87,650 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 80,350 రూపాయలు. ఫిబ్రవరి 1న 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.84,490 ఉండగా, ఫిబ్రవరి 19కి ఈ ధర 87,650 రూపాయలైంది. దాదాపు 20 రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర 3,160 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 2,900 పెరిగి ఫిబ్రవరి 1న 77,450 రూపాయలుగా ఉన్న ధర ఫిబ్రవరి 19కి 80,350 రూపాయలకు చేరింది.

బంగారం ధరలను ప్రపంచ దేశాల్లో నెలకొన్న పరిస్థితులు, దేశీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. సుంకాలపై ఆర్థిక అనిశ్చితి, ఆర్థిక లోటులు, డీడాలరైజేషన్, ట్రంప్ వాణిజ్య విధానాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల్లో పెరుగుదలను ప్రభావితం చేస్తున్నాయి. బంగారం ధరల పెరుగుదల, తగ్గుదల వంటివి అమెరికా వాణిజ్య విధానాలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, ప్రపంచ మార్కెట్ కదలికలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ALSO READ | ఫిబ్రవరి 28 నుంచి ప్రచయ్​క్యాపిటల్​ ఎన్సీడీ ఇష్యూ

ఈ రంగాలలో ఏవైనా ముఖ్యమైన మార్పులు జరిగితే బంగారం ధరలలో మరింత హెచ్చుతగ్గులకు దారితీయవచ్చు. గ్లోబల్‌‌గా అనిశ్చితి నెలకొనడడంతో ఇన్వెస్టర్లు షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న అసెట్స్‌‌ నుంచి ఫండ్స్ విత్‌‌డ్రా చేసుకుంటున్నారని, గోల్డ్ వంటి సేఫ్ అసెట్స్‌‌లో పెడుతున్నారని అనలిస్టులు పేర్కొన్నారు.