
- అండర్-19 వరల్డ్ కప్‌లో సూపర్ సిక్స్ పోరు నేడు
బ్లూమ్‌ఫోంటీన్ (సౌతాఫ్రికా): గ్రూప్ దశలో వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఇండియా కుర్రాళ్లు అండర్19 వరల్డ్ కప్‌లో అసలైన సవాల్‌కు రెడీ అయ్యాడు. మంగళవారం జరిగే సూపర్ సిక్స్ తొలి మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌తో పోటీ పడనున్నారు. గ్రూప్–ఏలో టాపర్‌గా నిలిచిన ఇండియా.. బంగ్లాదేశ్, ఐర్లాండ్, యూఎస్‌ఏలపై సులువుగా నిలిచింది. అదే జోరును కివీస్‌పైనా కొనసాగించాలని చూస్తోంది. గ్రూప్ దశలో ఆడిన వేదికపైనే న్యూజిలాండ్‌ను ఎదుర్కోవడం ఇండియన్స్‌కు అడ్వాంటేజ్ కానుంది.