
ముషీరాబాద్, వెలుగు: హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలో ఉన్న కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్‌స్టిట్యూషన్‌లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నట్లు విద్యాసంస్థల మేనేజ్‌మెంట్ తెలిపింది. ఈ మేరకు గురువారం కాలేజీలో ఏర్పాట్లను పోలీస్ అధికారులతో కలిసి ఇన్‌స్టిట్యూషన్ చైర్మన్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. అత్యధికంగా పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటున్న అంబేద్కర్ ఇన్‌స్టిట్యూషన్‌కు సీఎం రావడం సంతోషంగా ఉందని విద్యార్థుల పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకున్న వాళ్లు ప్రపంచవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉన్నారని విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు తెలిపారు. గ్రాడ్యుయేషన్ డే, పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.