జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఏడుగురు కార్పొరేటర్ల నామినేషన్లు

జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. కాంగ్రెస్ నుంచి ఏడుగురు కార్పొరేటర్ల నామినేషన్లు

జీహెచ్ఎంసీలో నామినేషన్లకు ఫిబ్రవరి 17 చివరి తేదీ కావడంతో నామినేషన్ల జోరు కొనసాగుతోంది. ఇవాళ మంగళవారం (ఫిబ్రవరి 17) కాంగ్రెస్ నుంచి  ఏడుగురు కార్పొరేటర్లు నామినేషన్ వేస్తున్నారు. అదేవిధంగా MIM నుంచి  ఎనిమిది మంది కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్న నామినేషన్లు వేయనున్నారు. 

ఇవాళ  కాంగ్రెస్ నుంచి చేసిన రహ్మాత్ నగర్ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, హస్తినాపురం కార్పొరేటర్ బాణోతు సుజాత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి  హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్, ఆర్సీ పురం కార్పొరేటర్ పుష్ప నగేష్ నామినేషన్ వేశారు. 

మంగళవారం మధ్యాహ్నం ఎనిమిది మంది MIM కార్పొరేటర్లు, మరో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు నామినేషన్ వేయనున్నారు. 15 మంది ఉండనున్న స్టాండింగ్ కమిటీలో ఇరు పార్టీల ఒప్పందంతో..  కాంగ్రెస్ ఏడుగురు, MIM ఎనిమిది మంది పోటీపడుతున్నారు. 

ALSO READ | క్యాస్ట్ సర్టిఫికెట్ మీకు తెలిసే ఉంటుంది.. కానీ.. ఇట్లాంటి సర్టిఫికెట్ కూడా ఉంటదని తెలుసా ?

మెజారిటీ సంఖ్యా బలం లేని కారణంగా స్టాండింగ్ కమిటీ ఎన్నికకు దూరంగా ఉండాలని బీజేపీ నిర్ణయించింది. అయితే BRS నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ వేశారు. తమకు సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ హ్యాండ్ ఇవ్వడంతో.. నామినేషన్లు విత్ డ్రా చేసుకునే ఆలోచనలో BRS ఉంది. 

స్టాండింగ్ కమిటీ అంటే ఏమిటి:

గ్రేటర్ర హైదరాబాద్ అభివృద్ధి కోసం ఏ నిర్ణయం జరగాలన్నా స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఒక రకంగా స్టాండింగ్ కమిటీ మెంబర్ అంటే కీలక నిర్ణయాల్లో భాగస్వాములయ్యే అవకాశం అన్నమాట. మున్సిపల్ చట్టం ప్రకారం 10 మంది కార్పొరేటర్లకు ఒక స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉంటారు. ఈ లెక్కన 150 మంది కార్పొరేటర్లకు 15 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నిక అవుతారు.