లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ రెండు జిల్లాల్లో తిరుగనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం వరంగల్, యాదాద్రి భువనిగిరి జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో మాట్లాడనున్నారు. సాయంత్రం 4 గంటలకు వరంగల్లోని అజంజాహి మిల్లు మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఈ మీటింగ్ కు రెండున్నర లక్షల మంది పబ్లిక్ వస్తారని అంచనా వేస్తున్నారు గులాబీ నేతలు. దీంతో సభా ఏర్పాట్లను దగ్గరుండీ పర్యవేక్షిస్తున్నారు జిల్లా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు. 50 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ కోసం ఖిలా వరంగల్లో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు వారం రోజుల నుంచి ఏర్పాట్లలో ఉన్నారు.
మరోవైపు వరంగల్లో బహిరంగ సభ తర్వాత భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. భువనగిరి టౌన్ కు సమీపంలో 16 ఎకరాల స్థలంలో కేసీఆర్ సభకు ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5.30 కు మీటింగ్ కు హాజరై మాట్లాడనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలను సమన్వయం చేసుకుంటూ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు లక్షల మందికి పైగా జనాన్ని మీటింగ్ కు తరలించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు గులాబీ నేతలు.