ఏపీ, తెలంగాణాలో ముగిసిన నామినేషన్ల పర్వం..

2024 సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి, నామినేషన్ల పర్వం ముగిసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో చివరి రోజు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. మే 13న ఏపీ, తెలంగాణాలో జరగబోయే 4వ దశ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు గాను నామినేషన్లకు గడువు ఈరోజుతో ముగిసింది.ఏపీలో 175అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు కాగా, 25ఎంపీ స్థానాలకు 600నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణాలో 17ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలైనట్లు సమాచారం.

Also Read:ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల

రేపు నామినేషన్ల పరిశీలన, ఈ నెల 29వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఇప్పటివరకూ నామినేషన్ ర్యాలీలతో తమ బలాన్ని ప్రదర్శించిన నేతలు ఇకపై ఓటర్లను ప్రసన్నం చేసుకుమనే చర్యలు ముమ్మరం చేయనున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఈ హోరాహోరీ పోరు ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.