ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదవడానికి ఈ రోజే లాస్ట్ డేట్. 2021న MLC ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ MLAగా గెలిచాడు. దీంతో ఆయన MLC పదవికి రాజీనామా చేయగా ఉప ఎన్నికలు వచ్చాయి. 2023 డిసెంబర్ 30 నుంచి ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది.
ఫిబ్రవరి 6(ఈ రోజు)న ఓటరు దరఖాస్తుకు చివరి రోజు. ఇప్పటి వరకూ 3లక్షల 50వేల మంది పట్టభద్రుల ఎలక్షన్లో నమోదు చేసుకున్నారు. ఎన్నికల కమీషన్ ఏప్రిల్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల చేయనుంది. 2023 నవంబర్1 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తై 3 సంవత్సరాలైన వారు MLC ఓటరుగా రిజిస్ట్రర్ అవడానికి అర్హులు. 2021న జరిగిన MLC ఎలక్షన్ లో 4,91,396 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1,67,947, మంది మహిళలు, 3,23,377మంది పురుషులు ఉన్నారు.