
- రాత్రి 12.12 నుంచి స్పోర్ట్స్18లో లైవ్
లాసానె : పారిస్ ఒలింపిక్స్‌లో వెండి పతకంతో చరిత్ర సృష్టించిన రెండు వారాల తర్వాత ఇండియా గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా మళ్లీ మైదానంలోకి వచ్చేస్తున్నాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్‌లో మరోసారి టైటిల్ నెగ్గాలని ఆశిస్తున్న స్టార్ జావెలిన్ త్రోయర్ గురువారం జరిగే లాసానె మీట్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. 2022 డైమండ్ లీగ్ చాంపియన్‌గా నిలిచిన 26 ఏండ్ల నీరజ్ గతేడాది అమెరికాలోని యూజీన్‌లో జరిగిన ఫైనల్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకబ్ వడ్లెచ్ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
ఈ సీజన్ డైమండ్ లీగ్ ఫైనల్స్ సెప్టెంబర్ 14న బ్రస్సెల్స్‌లో జరుగుతాయి. ఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే టాప్–6లో చోటు దక్కించుకోవాలి. నీరజ్ ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఫైనల్ బెర్తు దక్కించుకునేందుకు లాసానె మీట్ అతనికి కీలకం కానుంది. --కాగా, పారిస్ ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అర్షద్ నదీమ్ మినహా ఫైనల్లో టాప్–6 త్రోయర్లు లాసానె డైమండ్ లీగ్‌లో పోటీపడనున్నారు.