
బాల్కొండ,వెలుగు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరిపై మహారాష్ట్ర గవర్నమెంట్ నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు నుంచి శనివారం నీటిని విడుదల చేయనున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. అప్ప ట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఏటా జులైలో ప్రాజెక్టు గేట్లు ఎత్తి.. అక్టోబర్ 28న మూసివేయాలని.. అలాగే, వేసవికాలంలో తలెత్తే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని మార్చి 1న గేట్లు ఎత్తి.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 0.6 టీఎంసీల నీటిని వదలాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఈ వ్యవహారం మొత్తం సుప్రీంకోర్టు సూచనల తో నియమించిన త్రిసభ్య కమిటీ పర్యవేక్షణ లో జరగనుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుం చి వివిధ కాలువలద్వారా ఆయకట్టుకు నీటి విడుదల జరుగుతుండడంతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు (80.50 టీఎంసీలు) కాగా.. 1075.30 అడు గుల (33.49 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.