Today OTT Movies: ఓటీటీలోకి నేడు (మార్చి 20న) మూడు డిఫరెంట్ జోనర్స్.. క్రైమ్ యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మూవీస్

Today OTT Movies: ఓటీటీలోకి నేడు (మార్చి 20న) మూడు డిఫరెంట్ జోనర్స్.. క్రైమ్ యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మూవీస్

ఇవాళ (మార్చి 20న) ఓటీటీల్లో కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అందులో యాక్షన్ డ్రామా, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలున్నాయి. ఈ సినిమాలు 2025 ఏడాదిలోనే వచ్చి థియేటర్ ఆడియన్స్ ని మెప్పించాయి. అందులో ఒకటి 2024 చివర్లో వచ్చి ఆకట్టుకుంది. మరి ఆ సినిమాలేంటీ? అవి ఎక్కడ స్ట్రీమింగ్ కి వచ్చాయో ఓ లుక్కేద్దాం. 

బ్రహ్మా అనందం:

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఆయన తనయుడు హీరో రాజా గౌతమ్ కలసి నటించిన లేటెస్ట్ మూవీ "బ్రహ్మా అనందం". గత నెల (ఫిబ్రవరి 14న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా నేడు పూర్తిస్థాయిలో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.

యంగ్ డైరెక్టర్ ఆర్వీయస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆహాలో అందుబాటులోకి వచ్చింది. తాతామనవళ్ల రిలేషన్ చుట్టూ అల్లుకున్న కథ అలరించినప్పటికీ.. కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.  ప్రేమ‌కు వ‌య‌సుతో సంబంధం ఉండ‌ద‌నే పాయింట్‌కు తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధాన్ని జోడిస్తూ డైరెక్ట‌ర్ ఆర్‌వీఎస్ నిఖిల్ ఈ మూవీని తెర‌కెక్కించాడు.

ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కల్ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, సంపత్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషించారు.  రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ మూవీకి శాండిల్య  పీసపాటి సంగీతం అందించాడు.

కథేంటంటే:

బ్రహ్మానందం(హీరో గౌతమ్) చిన్నప్పుడే తల్లిదండ్రులని కోల్పోయి అనాథగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. దీంతో చుట్టుప్రక్కల వాళ్ళని పట్టించుకోకుండా  సెల్ఫిష్ గా ఉంటాడు. అయితే బ్రహ్మానందం కి థియేటర్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. దీంతో అవకాశాలు కోసం ప్రయత్నిస్తుంటాడు. కానీ డబ్బు లేకపోవడంతో ఇబ్బంది పడుతుంటాడు.

ఈ క్రమంలో ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న రామ్మూర్తి (బ్రహ్మానందం)ని అనుకోకండా కలుస్తాడు. దీంతో 10 రోజులపాటూ తనతో తన విలేజ్ కి వచ్చి మనవడిగా నటిస్తే డబ్బులిస్తానని తనతోపాటు తన ఊరికి తీసుకెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరికి బ్రహ్మానందం అనుకున్నది సాధించాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

జితేందర్‌రెడ్డి:

రాకేష్ వ‌ర్రే హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ జితేందర్‌రెడ్డి (Jithender Reddy). ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. జగిత్యాలకు చెందిన నాయకుడు, దివంగత ABVP లీడర్ జితేందర్ రెడ్డి అలియాస్ జిత్తన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. 2024 నవంబర్ 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చింది. 

జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో కీలక పాత్ర వహించిన నేత లైఫ్‌లోని కీలక సన్నివేశాలను ఆధారంగా చేసుకొని జితేందర్ రెడ్డి పేరుతోనే సినిమాను నిర్మించారు. 

కథేంటంటే::

1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యధార్ధ గాథ ఇది. జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్‌ రెడ్డి (రాకేశ్‌ వర్రె) కీలక పాత్ర పోషించారు. ఆయన చిన్నప్పటి నుంచి దేశం, ప్రజల కోసం పనిచేయాలని తపన పడుతుంటారు. ఈ క్రమంలో నక్సలైట్స్ చేత హత్యకు గురైన ఒక 18 యేళ్లు లేని కుర్రాడిని చూసి ఆయనకు విపరీతంగా కోపం వస్తుంది. ఇక నక్సలైట్స్ లోకి వెళ్ళొద్దని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడం చేస్తాడు.

ఈ క్రమంలోనే  భూమి కోసం, పీడిత ప్రజల బాగు కోసం గన్నులు చేత పట్టినట్టు చెప్పుకునే నక్సలైట్స్ దారితప్పినట్టు గుర్తించడం.. ఇలా చివరివరకు నక్సలైట్స్ పై వ్యతిరేకంగా ఎలా పోరాడారో? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? ఈ క్రమంలో ఆయన సన్నిహితులపై నక్సలైట్స్ ఎలా ఎన్ కౌంటర్లు జరిపారు?

జితేందర్‌ రెడ్డి ఎలా ప్రజా నాయకుడిగా ఎదిగాడు? ఇక చివరికి నక్సల్స్‌ చేతుల్లో ఎలా మరణించాడు? ఆయన ప్రేమకథేంటీ?  సీనియర్ ఎన్టీఆర్ ని ఆయన ఎందుకు కలిసాడు? అనే తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ:

మలయాళంలో వచ్చిన లేటెస్ట్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజైంది. ఇందులో కుంచాకో బోబన్‌, ప్రియమణి, జగదీశ్‌, విశాక్‌ నాయర్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. అక్కడీ ప్రేక్షకులను ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంది. దాంతో ఇటీవలే మార్చి 14న తెలుగు థియేటర్స్ లో వచ్చింది. ఇక వారం గడవక ముందే ఓటీటీలోకి అడుగుపెట్టింది.  

ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మలయాళం, హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ భాషలలో నెట్‍ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాకు జితూ అష్రాఫ్ దర్శకత్వం వహించారు. మలయాళంలో దాదాపు రూ.12 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.40 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.

కథేంటంటే:

హరిశంకర్ (హరి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. చంద్రబాబు (జగదీష్) ఇమిటేషన్ (న‌కిలీ) బంగారు గొలుసును తనఖా పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అతనికి ఫిర్యాదు అందుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ఎలాంటి సవాళ్లు ఎదుర్కొ న్నాడు? ఆయన వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలేంటి? ఒక చిన్న నేరాన్ని దర్యాప్తు చేస్తూ ఆర్గనైజ్‌ నేరాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైకో కిల్లర్స్‌ని ఎలా వెలికితీస్తాడనే అనేదే మిగతా సినిమా కథ.

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్:

'ఖాకీ: ది బెంగాల్ చాప్టర్' (Khakee The Bengal Chapter). నేడు మార్చి 20న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.  బేబీ, అయ్యారీ, స్పెషల్ 26, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ మరియు సికందర్ కా ముఖద్దర్ సినిమాలను డైరెక్ట్ చేసిన నీరజ్ పాండే ఈ సిరీస్కు షో రన్నర్గా వ్యవహరించాడు. దేబాత్మ మండల్ డైరెక్ట్ చేశాడు. మొదట నవంబర్, 2022లో ఫస్ట్ సీజన్ వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2023లో రెండో సీజన్ను కూడా తీసుకొచ్చారు. ఇప్పుడిది షో ఖాకీ: ది బీహార్ చాప్టర్‌కు కొనసాగింపుగా వచ్చింది. 

ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ కథ:

ఈ సిరీస్ 2000ల ప్రారంభంలో బెంగాల్ నేపథ్యంలో సాగుతుంది. పవర్ కోసం (అధికార దాహం) ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులు ఓవైపు, అలాగే చట్టం అమలు చేయుటకు, శాంతిని కాపాడుకోవడానికి అధికారులు కష్టం మరోవైపు.

ఇందులో భాగంగా ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ మైత్రాకు.. గ్యాంగ్‌స్టర్లు, రాజకీయ నాయకులకు మధ్య జరిగే సంఘర్షణే ఈ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్ కథ. ఇటువంటి వ్యవస్థలు నగరాన్ని పీడిస్తున్న హింసను ఐపీఎస్ మైత్రా ఎలా అరికట్టాడనేది మెయిన్ స్టోరీ.