పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, దుదిళ్ల శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం పర్యటించనున్నారు.
ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం రామగుండం సీపీ శ్రీనివాసుతో కలిసి కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.