నేడు బీజేపీ నుంచి సైదిరెడ్డి నామినేషన్​

  •     హాజరుకానున్న కేంద్ర మంత్రి కిరణ్​రిజీజు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : నల్లగొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సోమవారం నామినేషన్ వేయనున్నట్లు నల్లగొండ పార్లమెంట్ ప్రబారీ చాడ శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్​రెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 వేల మంది కార్యకర్తలు, నాయకులతో నగరంలో రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్

పార్లమెంట్ కో –కన్వీనర్ పిల్లి రామరాజుయాదవ్, నాయకులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, బండారు ప్రసాద్, పోతేపాక సాంబయ్య, పోతేపాక లింగస్వామి, మిర్యాల వెంకటేశం, ఫకీరు మోహన్ రెడ్డి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, దాయం భూపాల్ రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.