OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

OTT Telugu Movies: ఇవాళ (Nov28) ఓటీటీకి వచ్చిన రెండు బ్లాక్‌బస్టర్ తెలుగు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

2024 దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన లక్కీ భాస్కర్ (Lucky Baskhar) మూవీ.. ఇవాళ Nov 28న ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా వచ్చిన ఈ మూవీని దర్శకుడు వెంకీ అంట్లూరి (Venky Atluri) తెరకెక్కించాడు.

లక్కీ భాస్కర్ (Lucky Baskhar) ఓటీటీ:

పీరియడ్ బ్యాక్ డ్రాప్లో బ్యాంక్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ను ఆలోచింపజేసింది. కంటెంట్ పరంగానే కాకుండా కమర్షియల్ గాను మెగా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు బడ్జెట్ రూ.56 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ.. ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా రూ.109.82 కోట్లని వసూలు చేసింది. ఇక థియేటర్ లో మిస్ అయిన ఆడియన్స్ ఆలస్యం చేయకుండా ఓటీటీలో లక్కీ భాస్కర్ ని చూసేయండి.

ప్రస్తుత టెక్నాలజీ కాలంలో.. స్టాక్ ఎక్సేంజ్, బ్యాంకుల్లో జరిగే స్కామ్లు జరుగుతున్నా విషయం వింటుంటుంటాం..చూస్తుంటాం. కానీ అవేమాత్రం సామాన్య మనుషులకి అర్ధమయ్యేలా ఉండవు. ఇదే విషయాన్ని..అంటే 'ఫైనాన్షియల్ స్కామ్స్ జరిగే తీరును..అందరికీ అర్థమయ్యేలా.. ఆసక్తి రేకెత్తించేలా ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్స్ తో వెంకీ అట్లూరి చూపించిన విధానం బాగుంది.

ఇక డైరెక్టర్ వెంకీ రాసుకున్న బలమైన స్క్రిప్టుకు హీరో దుల్కర్ సల్మాన్ తన ఫెర్ఫార్మెన్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఓ చిన్న బ్యాంక్ ఉద్యోగి.. సులువుగా డబ్బు సంపాదించే మార్గం వెతుక్కొని.. అలా కోట్లు సంపాదించి, వాటిని క్షణాల్లో ఖర్చు చేసేసి ఎలా మారడనే ఈ కథనం అందరినీ మెప్పించేలా చేస్తోంది.

Also Read:-నేను, నా ఫ్యాన్స్ తగ్గేదేలే.. ఇకపై విరామం లేకుండా సినిమాలు చేస్తా

'క'(KA) మూవీ ఓటీటీ:

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) విభిన్నంగా సింగిల్ లెటర్ 'క'(KA)టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ను అందుకున్నారు. సుజీత్‌, సందీప్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్గా తెలుగులో(Oct31న) రిలీజై.. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.

క మూవీ ఇవాళ గురువారం (నవంబర్ 28) నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ మూవీ ఓటీటీ హక్కుల కోసం దాదాపుగా రూ.6 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. దాంతో కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు, ఓటీటీ రైట్స్ సాధించిన చిత్రంగా క సినిమా నిలిచింది. క మూవీ దాదాపు రూ.22 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది.