తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్..ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ శుక్రవారం (నవంబర్ 8న) థియేటర్లోకి వచ్చిన కొత్త సినిమాలు ఏంటీ? వాటి కథేంటీ? అన్నది చూద్దాం.
‘ధూం ధాం’::
చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ధూం ధాం’. సాయి కిషోర్ మచ్చా దర్శకత్వంలో ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. ఇవాళ శుక్రవారం (నవంబర్ 8న) సినిమా థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.ప్లెజెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో హిలేరియస్ కామెడీతో తెరకెక్కింది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో::
యంగ్ టాలెంటెడ్ నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddhartha) హీరోగా సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’(AIE). రుక్మిణీ వసంత్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్. బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ శుక్రవారం (నవంబర్ 8న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ తెరకెక్కింది.
జాతర::
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతర’. రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. ఇవాళ శుక్రవారం (నవంబర్ 8న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘చిత్తూరు జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సతీష్ బాబు ఈ కథను రాశారు. 18 గ్రామాలకు కాపు కాసే దేవత చుట్టూ జరిగే కథ.
జితేందర్‌రెడ్డి::
రాకేష్ వర్రే హీరోగా నటించిన ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించిన మూవీ జితేందర్‌రెడ్డి. జగిత్యాలకు చెందిన నాయకుడు, దివంగత ABVP లీడర్ జితేందర్ రెడ్డి అలియాస్ జిత్తన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. ఇవాళ శుక్రవారం (నవంబర్ 8న) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
బ్లడీ బెగ్గర్::
బిగ్ బాస్ తమిళ్ నుంచి బయటికి వచ్చాక వరుస హిట్లతో జోరుమీదున్న కెవిన్ రాజ్ చేస్తున్న మూవీ ‘బ్లడీ బెగ్గర్’(Bloody Beggar). కాళ్లు చేతులు సరిగ్గా ఉన్నా, అడుక్కోవడానికి నాటకాలు ఆడే ముష్టివాడి పాత్రలో కెవిన్ నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ కూడా శుక్రవారం (నవంబర్ 8న) ప్రేక్షకుల ముందుకొచ్చింది.