Releasing Movies: ఇవాళ థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమాలు.. ఇండస్ట్రీ బ్లాక్బాస్టర్ రీ రిలీజ్ కూడా!

Releasing Movies: ఇవాళ థియేటర్లలో రిలీజైన తెలుగు సినిమాలు.. ఇండస్ట్రీ బ్లాక్బాస్టర్ రీ రిలీజ్ కూడా!

ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి.అందులో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. ఇక ఈ శుక్రవారం (అక్టోబర్ 18న) కూడా థియేటర్ విభిన్న కథలతో కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేవి చూద్దాం.

వీక్షణం

రామ్ కార్తీక్, క‌‌‌‌‌‌‌‌శ్వి జంటగా మ‌‌‌‌‌‌‌‌నోజ్ ప‌‌‌‌‌‌‌‌ల్లేటి దర్శకత్వంలో పి పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వీక్షణం’ (Veekshanam). ఇవాళ శుక్రవారం అక్టోబర్ 18న థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిస్టరీ థ్రిల్లర్ జానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా తెరకెక్కింది. మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీమియర్ షోలు రిలీజ్ డేట్‌కు ఒకరోజు ముందే అంటే గురువారం (అక్టోబర్ 17) వేశారు. 

Also Read:-మహేష్-రాజమౌళి మూవీ.. రెండు భాగాలుగా హై-వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్‌!

లవ్ రెడ్డి

అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి జంటగా స్మరన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ రెడ్డి’. హేమలత రెడ్డి, మదన్ గోపాల్ రెడ్డి, ప్రభంజనం రెడ్డి, నాగరాజు బీరప్ప కలిసి నిర్మించారు. ఈ మూవీ ఇవాళ శుక్రవారం అక్టోబర్ 18న థియేటర్స్లో రిలీజయింది. ఇప్పటికే విడుదలైన లవ్ రెడ్డి టీజర్, ట్రైలర్ వంటి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. దాంతో లవ్ రెడ్డిపై కాస్తా హైప్ క్రియేట్ అయింది. అయితే, గురువారం (అక్టోబర్ 17)న ప్రీమియర్ షోలు వేశారు.

రివైండ్

యంగ్ హీరో సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘రివైండ్’. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో అమృత చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు కళ్యాణ్ చక్రవర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ.. ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ఇవాళ అక్టోబర్ 18న థియేటర్లో రిలీజయింది. 

ఖడ్గం రీ రిలీజ్

విలక్షణ డైరెక్టర్ కృష్ణవంశీ దేశభక్తి కథాంశంతో 22 ఏళ్ల క్రితం‘ఖడ్గం’ సినిమాను తెరకెక్కించారు.ఇప్పుడీ సినిమాను.. ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 18న) రీ రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశారు మేకర్స్. 2002 సంవత్సరలో రిలీజైన ఈ సినిమాకు సుంకర మధు మురళీ నిర్మాతగా వ్యవహరించారు. శ్రీకాంత్, రవితేజ, ప్రకాశ్ రాజ్, సొనాలీ బింద్రే, సంగీత, కిమ్ శర్మ తదితరులు నటించారు. ఈ సినిమాకు నటుడు ఉత్తేజ్, సత్యానంద్ మాటలు అందించారు.

  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature