పొట్టేల్:
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల (Ananya Nagalla) జంటగా సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగె నిర్మించిన చిత్రం ‘పొట్టేల్’(Pottel). ఈ మూవీ ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 25న) థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఒక రోజు ముందుగానే (అక్టోబర్ 24న) ప్రీమియర్స్ ప్రదర్శించింది.
కాగా 1980 నాటి నేపథ్యంలో తెలంగాణలోని ఓ పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో ముఖ్యంగా జీవితంలో చదువు ఎంత ముఖ్యమనే విషయాల్ని ఎమోషనల్గా తెరకెక్కించారు.
లగ్గం::
సాయిరోనక్, ప్రగ్యా నగ్రా ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం 'లగ్గం'. వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 25న) థియేటర్లలో రిలీజైంది.
రమేశ్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో జరిగే స్టోరీతో ఈ మూవీని తీశారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ కి స్పందన బాగానే వచ్చింది. స్థానికంగా ఉండే సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంతో గ్రామీణ కుటుంబాల్లో ఉండే ప్రేమానురాగాలు, సాఫ్ట్‌వేర్ సంబంధాలు, వ్యవసాయం, నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
నరుడి బ్రతుకు నటన
శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న లీడ్ రోల్స్‌లో రిషికేశ్వర్ యోగి రూపొందించిన చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. టీజీ విశ్వ ప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధు రెడ్డి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఇవాళ అక్టోబర్ 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. టీజర్, ట్రైలర్ విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.