మేషం(మార్చి21–ఏప్రిల్2)
ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. తండ్రి తరఫు వారితో విభేదాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నిలిచిపోయిన ఇంటి నిర్మాణం పునఃప్రారంభిస్తారు. ఉద్యోగాన్వేషణలో విజయం. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు. సోదరులతో వివాదాలు ఉన్నా సర్దుబాటు కాగలవు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం.
వృషభం (ఏప్రిల్21 – మే21)
ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. తండ్రి తరఫువారితో అకారణ విరోధాలు. తరచూ ప్రయాణాలు. బంధువుల నుంచి మీపై ఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు వాయిదా. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. రుణహామీలపై ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పకపోవచ్చు. వారాంతంలో ధనప్రాప్తి. శుభవర్తమానాలు అందుతాయి.
మిథునం (మే22–జూన్22)
కొన్ని సంఘటనలు మీ మనసును నొప్పిస్తాయి. ఆదాయం తగ్గినా అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులు మిమ్మల్ని విమర్శిస్తారు. కోర్టు వ్యవహారాలలో పురోగతి. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. ఉద్యోగాన్వేషణలో ప్రతిబంధకాలు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనప్రాప్తి. ఉద్యోగాన్వేషణలో ప్రతిబంధకాలు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. వ్యాపారులకు లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ధనప్రాప్తి.
కర్కాటకం (జూన్23 – జూలై23)
కొన్ని కార్యక్రమాలలో విజయం. అదనపు రాబడి ఉత్సాహాన్నిస్తుంది. సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖుల పరిచయం. విద్యార్థుల ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. ఒక లేఖలోని సారాంశం ఆకట్టుకుంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు ప్రయత్నాలు సఫలం. విమర్శలు తొలగుతాయి. ఇంటినిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది.
సింహం (జూలై24 – ఆగస్టు22)
నేర్పు, చాకచక్యంతో సమస్యలు అధిగమిస్తారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఇంటిలో శుభపరిణామాలు. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు కుదురుతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు పెట్టుబడులకు మార్గం సుగమం. ఉద్యోగబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు..
కన్య (ఆగస్టు23 – సెప్టెంబర్22)
కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో విభేదిస్తారు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారవచ్చు. కుటుంబ బాధ్యతలపై అధిక దృష్టి. సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మనసులోని భావాలను కుటుంబసభ్యులతో పంచుకుంటారు. రావలసిన డబ్బు అందడంలో జాప్యం. వ్యాపారులకు ఆశించిన లాభాలు కష్టసాధ్యం కావచ్చు. ఉద్యోగులకు అదనపు పనిభారం. వారం మధ్యలో విందులు, వినోదాలు. వాహనసౌఖ్యం. కొత్త పరిచయాలు.
తుల (సెప్టెంబర్23 – అక్టోబర్22)
మీకష్టం ఫలిస్తుంది. కార్యక్రమాల్లో విజయం. పలుకుబడి కలిగిన వారు పరిచయమై సాయపడతారు. రాబడికి లోటు ఉండదు. విద్య, ఉద్యోగాన్వేషణలో ముందడుగు. కోర్టు వ్యవహారాల్లో అనుకూలత. కొన్ని మోసాల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. జీవిత భాగస్వామితో అపార్ధాలు తొలగుతాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులు ఉన్నతస్థితికి చేరుకుంటారు.
వృశ్చికం (అక్టోబర్23– నవంబర్22)
పట్టుదల, ఆత్మవిశ్వాసంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం మెరుగుపడే అవకాశం. ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఇంటిలో బంధువుల తాకిడి పెరుగుతుంది. వాహనసౌఖ్యం. విద్యావకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలకు హాజరవుతారు. భూవివాదాల పరిష్కారం. పరపతి కలిగిన వ్యక్తుల పరిచయం. శత్రువులను ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులు ఎంతటి పనైనా అవలీలగా చేస్తారు.
ధనుస్సు (నవంబర్23 – డిసెంబర్22)
తండ్రి తరఫు ఆస్తి లేదా ధనలాభ సూచనలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. యుక్తితో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు రాగలదు. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి విముక్తి. కుటుంబంలో మీ అభిప్రాయాలు, ప్రతిపాదనలకు ఎదురుండదు. వ్యాపారులకు కొంత విజయం. ఉద్యోగులకు అదనపు విధుల నుంచి ఉపశమనం.
మకరం (డిసెంబర్23 – జనవరి22)
మీ అంచనాలకు తగిన రాబడి. ఖర్చులు తట్టుకుంటారు. బంధువులు, స్నేహితులతో వివాదాల పరిష్కారం. ఆత్మీయులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో హామీలు మంచిది కాదు. ఆస్తి విషయంలో తండ్రి తరఫు వారితో వివాదాలు నెలకొనవచ్చు. ముఖ్య కార్యక్రమాలు నిదానంగా పూర్తి. వ్యాపారులు ఆశించిన లాభాలు దక్కక డీలా పడతారు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు సంభవం. వారారంభంలో ధనలాభం. ఆహ్వానాలు. సత్కారాలు.
కుంభం (జనవరి23 – ఫిబ్రవరి22)
మీ పట్టుదల, ధైర్యానికి ఈవారం పరీక్షా సమయం. ఆలోచనలు నిలకడగా ఉండవు. తరచూ ప్రయాణాలు సంభవం. విద్యావకాశాలు చేజారవచ్చు. ఆదాయానికి లోటుండదు. కానీ, ఖర్చుల వల్ల అప్పులు చేస్తారు. కొన్ని విషయాలలో రాజీమార్గం తప్పనిసరి. వాహనాలు నడిపే వారు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు అందిన లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. వారాంతంలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి.
మీనం (ఫిబ్రవరి23 – మార్చి20)
మీ వ్యూహాలు, అంచనాలు నిజం చేసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. కొన్ని బాకీలు వసూలవుతాయి. మీ శక్తిసామర్థ్యాలతో ఎంతటి కార్యాన్నైనా సాధిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి. జీవితంలో మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగయత్నాలలో అనుకూల పరిస్థితులు. కొన్ని సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు.