రేవంత్,షర్మిల పాదయాత్ర..భారీ బందోబస్త్ 

 రేవంత్,షర్మిల  పాదయాత్ర..భారీ బందోబస్త్ 

జనగామ జిల్లా : ఇవాళ జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఇద్దరు కీలక నేతల పాదయాత్ర ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.  పాలకుర్తి నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంది. మరోవైపు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా ఉంది. దేవరుప్పుల మండలంలోని దుకాణాలను మూసివేయించారు. డ్రోన్ కెమెరాలతో పరిస్థితులను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.